అందాలగుమ్మ అక్కినేని కోడలు సమంత ఎంత అందంగా ఉంటదో..ఆమె మనస్సు కూడా అంతే అందమైనది .ఎవరికైనా కష్టం వస్తే వెంటనే చలించిపోతుంది.తనకు చాతనైనంత సాయం చేసి గొప్ప మనస్సును చాటుకుంటుంది.అయితే ఇప్పటికే ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద బాలలను ఆదుకుంటోంది. అనారోగ్యంతో ఉన్న బాలలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటుంది.ఈ క్రమంలోనే తాజాగా అక్కినేని కోడలు సమంత మరో అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. తన కుటుంబం ఈ ఏడాది అంతా వంద మంది చిన్నారులకు ఉచిత భోజనం పెడుతుందని ప్రకటించింది . ఏడాది మొత్తం ఒక పూట ‘అక్షయపాత్ర’ ద్వారా చిన్నారులకు భోజనం పెడతామని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది . ఇందుకు తమ వంతు సాయం చేయాలని అభిమానులను కోరింది. ‘కేవలం రూ.950లతో ఒక స్కూల్ విద్యార్థికి ఏడాది మొత్తం రుచికరమైన పోషకాహారాన్ని అందించవచ్చు.. ’ అని పేర్కొంది.
This year our family is sharing our lunch with 100 schoolchidlren for an entire year!
You too can join by just contributing just 950/-. That provides hot, tasty & nutritious lunch to a schoolchild for an entire year!https://t.co/jGi8v2QEap#iShareMyLunch#AkshayaPatra
— Samantha Akkineni (@Samanthaprabhu2) June 22, 2018