ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన ప్రతీ ఒక్కరిని పార్టీ తరపున పోటీ చేయించారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారికి సీటు ఇవ్వకుండా గడిచిన ఎన్నికల్లో నిరాశ చేకుర్చారు .అంతే కాదు టీడీపీ సీనియర్ నాయకులకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా సీటు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో వారు గడిచిన ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో 2019ఎన్నికలు దగ్గరకు రానే వచ్చాయి కానీ చంద్రబాబు మాత్రం సీనియర్ టీడీపీ నాయకుల గురించి ఉలుకు పలుకు లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీంతో వారు టీడీపీలో ఉంటే తమకు ఎదుగుదల ఉండదని భావించి, ఫ్యూచర్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడు వారికి షాక్ ఇవ్వక ముందే వారు టీడీపీకి గుబై చెప్పి చంద్రబాబును షాక్ కు గురిచేస్తున్నారు.
see also:బ్రేకింగ్ న్యూస్…వైసీపీలోకి మంత్రి గంటా శ్రీనివాసరావు..!
మరోపక్క టీడీపీలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు ,ఏంపీలు, మంత్రులకు కూడ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని …వారు టీడీపీ పార్టీని మారే అలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో ముందుగా విశాఖ జిల్లా నుండి మొదలైయినట్లు తెలుస్తుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఇప్పటివరకు మూడు పార్టీలు మారిన కానీ ఆ పార్టీ లలో ఉన్నత పదవులు వారిస్తూ వస్తున్నా.. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ లో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో విశాఖలో టీడీపీ నుండి తొలి వికెట్ ఔట్ అంటున్నారు వైసీపీ అభిమానులు. ఇక వైఎస్ జగన్ హావా మొదలైయ్యింది…ఇక ఎవరు అడ్డు వచ్చిన 2019 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపలేరు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.