ఏపీలో ఇటీవలే టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు శాశ్వతంగా రాజకీయలు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటిండంతో రాజకీయం మరింత వెడెక్కింది. ఒకరి తరువాత ఒకరు శాశ్వతంగా రాజకీయలు నుండి తప్పుకొవడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ప్రతి పక్ష బలమా ..లేక అధికార పార్టీ చేసిన పాలన అని ఒక్కటే చర్చ జరుగుతున్నది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు ముందు అమలుకాని 600 అపద్దపు హమీలు ఇచ్చి అధికారలంలోకి వచ్చాడని వైసీపీ నేతలు ఎన్నో సార్ల్ బహిరంగంగా అన్నారు. అంతేకాదు 600 వాగ్ధానాలు చేసి ఏ ఒక్కటీ కూడ నెరవేర్చలేదని నగ్నసత్యం అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. ఈ తరుణంలో ఏపీ మొత్తం టీడీపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరోపక్క ఏపీ ప్రధాన ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్పం పేరుతో వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర భారీ విజయం సాదించింది. అలుపెరగని బాటసారిలా… జనం ఆదరణతోనే తనలో కొత్త ఉత్సాహన్ని నింపుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్ . ప్రజల కష్టాలు వింటూ.. కన్నీరు తుడుస్తూ… భరోసానిస్తున్నారు. గతేడాది నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యువనేత సంకల్పయాత్ర నేటితో 195 రోజులు పూర్తి చేసుకుంది.
see also:బ్రేకింగ్ న్యూస్…వైసీపీలోకి మంత్రి గంటా శ్రీనివాసరావు..!
ఈ ప్రజా సంకల్పయాత్రతో చంద్రబాబుకు కౌంట్‌డౌన్ ప్రారంభం అయ్యిందని వైసీపీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు మరో 10 సంవత్సరాలు వైఎస్ జగనే ముఖ్యమంత్రి అని కచ్చితంగా చెబుతున్నారు. దీంతో టీడీపీ నేతలు అలోచనలో పడ్డారు. తాజాగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వచ్చే అవకాశం లేదని..ఇచ్చిన గెలిచే అవకాశం లేదని టీడీపీ సీనీయర్ రాజకీయ నాయకుడు ప్రస్తుత ఏపీ అర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాశ్వతంగా రాజకీయలు నుండి తప్పుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. నిజంగా ఓట్ల కోసం చంద్రబాబు ఎన్ని అబద్దాలైనా ఆడతారని, వాటిని నమ్మవద్దని వైఎస్ జగన్ చెప్పినట్లు జరుగుతుంది.