ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, పీవీ సింధు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.25 లక్షల విరాళం అందజేశారు. ఆమె ఇటీవల బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ కార్యక్రమంలో భాగంగా సింధు రూ.25 లక్షల మొత్తం బహుమతిగా గెల్చుకున్నారు. అయితే వాటిని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలని భావించిన సింధు ఆ మొత్తాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.