ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరకాల పంపించారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అయిన పరకాల ప్రభాకర్‌ను ప్రభుత్వంలో కొనసాగిస్తూ…తమపై బీజేపీతో దోస్తీ విషయంలో చంద్రబాబు విమర్శలు చేయడం ఏంటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌పై నెపం వేస్తూ పరకాల రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా తనపై చేస్తున్న నిందాప్రచారంపై కలత చెందానని పేర్కొంటూ తక్షణం రాజీనామా ఆమోదించాలని లేఖలో ముఖ్యమంత్రిని పరకాల ప్రభాకర్ కోరారు.
see also:జలీల్ఖాన్ను మించిన కామెడీ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ
`విపక్షానికి చెందిన కొంతమంది నాయకులు నేను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలలో ఉండడాన్ని పదే పదే ఎత్తి చూపుతున్నారు. కేంద్రంపై, బీజేపీపై జరుగుతున్న ధర్మ పోరాటం మీద ప్రజలలో అనుమానాలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలో నా ఉనికిని, మీ చిత్తశుద్ధిని శంకించడానికి వాడుకుంటున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని లేవనెత్తి మీరు చేస్తున్న పోరాటాన్ని శంకించేలా మాట్లాడారు. నా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు, రాజకీయ ప్రయోజనాలనూ, ప్రాతిపదికనూ ఆపాదించ పూనుకోవడం, వాటిని తెరవెనుక మంతనాలకు బేరసారాలకూ మీరు వినియోగిస్తారని ఆరోపించడం సరికాదు. నా కుటుంబం లోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉన్నందు వల్ల, నాకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందు వల్ల మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడతాను అని కొందరు ప్రచారం చేయడం చాలా బాధిస్తోంది. నా వల్ల మీకూ, ప్రభుత్వ ప్రతిష్ఠకూ నలుసంతయినా నష్టం జరగరాదని నా దృఢ అభిప్రాయం. అందుచేత నేను ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నాను“ అంటూ తన లేఖలో పరకాట పేర్కొన్నారు.
see also:ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయం.. మాజీ ఎంపీ సంచలన వాఖ్యలు
కాగా, ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగిన రెండు నెలల తర్వాత…అది కూడా విపక్ష నేత వైఎస్ జగన్ విమర్శలు చేసిన సమయంలో..పరకాల పదవికి గుడ్ బై చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ నిర్ణయం పరకాల తీసుకున్నది కాదని చంద్రబాబే తన ఎదుగుదల మేరకు ఇలా తీసుకునేలా చేశారని పలువురు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.