ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన అధికార మదాన్ని చూపించారు .గతంలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను వేసిన రోడ్ల మీద తిరుగుతారు .నేను ఇచ్చే పెన్షన్ తీసుకుంటారు .నేను అమలు చేసే పథకాలను తీసుకుంటారు కానీ నాకు ఓట్లు వేయరా ..వేస్తారు ..ఎందుకు వేయరు ..
see also:జగన్ చేసిన పనికి.. పీ.గన్నవరం ప్రజలు ఫిదా..!
వేయకపోతే నేను ఇచ్చే రోడ్ల మీద తిరగొద్దు ..నేను ఇచ్చే పెన్షన్ తీసుకోవద్దు.నేను అమలు చేసే పథకాలను తీసుకోవద్దు అని పరువు పోగొట్టుకున్న సంగతి తెల్సిందే .తాజాగా తమ డిమాండ్లను పరిష్కరించాలని నాయీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సాక్షాత్తు సచివాలయంలో కలిశారు .తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు.దీంతో చిర్రెత్తుకుపోయిన చంద్రబాబు నాయుడు ఇది చేపల మార్కెట్ అనుకుంటున్నారా ..
see also:కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలం..రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త బంద్
జీతాలు పెంచేది లేదు ..ఏఊరు నుండి వచ్చారు ..ముందు విధుల్లో చేరండి ..మీకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తా చేస్తే చేయండి ..లేకపోతె లేదు ..నచ్చితే చేయండి ..లేకుంటే వెళ్ళిపొండి అని వేలు చూపిస్తూ మరి దాదాగిరికి దిగారు చంద్రబాబు.ఆకలితో అలమటిస్తున్న తమ సమస్యలను పరిష్కరిస్తారు అని ముఖ్యమంత్రి దగ్గరకు వస్తే ఆయనే ఇలా మాట్లాడితే ఏమి చేయాలో అర్ధం కాక మొఖాలు నేలకేయడం వారి వంతైంది ..