ఆయన ఏపీ ప్రస్తుత అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత ..ఆయన పొలిటికల్ ఎంట్రీ టీడీపీ నుండే..సరిగ్గా పంతోమ్మిదేళ్ళ కిందట టీడీపీలో చేరిన ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు.ఆ తర్వాత ఐదేండ్లకు అంటే 2004లో జరిగిన ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి అదే పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు ..ఆ తర్వాత ఐదేండ్లకు అంటే 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది..కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం వీలినమైనాక మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు..
see also:గోదావరి జిల్లాల ప్రజల ఓట్లు ఏ పార్టీకి.. ఎలా..??
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మరల సొంత గూటికి చేరి గత సార్వత్రిక ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు .ఇంతకూ ఎవరాయన అని ఆలోచిస్తున్నారా..ఆయనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓటమి అనేది లేకుండా గెలుస్తూ వస్తున్న ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు .అయితే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ రాజకీయాలకు దూరంగా ఒక మాజీ ఎంపీకి చెందిన బృందం చేసిన సర్వేలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఓడిపోతారు .ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఒక ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.
see also:వచ్చే నెల 8వ తేదీన వైసీపీలోకి మాజీ మంత్రి కొండ్రు మురళి ..!
ఈ ప్రసారంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ..మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు మీరు మరల ఓట్లు వేస్తారా..ఆయన పని తీరు ఎలా ఉందని సర్వే చేయగా ఏకంగా 54.26శాతం మంది మంత్రి గంటా శ్రీనివాసరావు పనితీరు బాగోలేదని..ఎన్నికలు వస్తే ఆయనకు ఓట్లు వేయము అని తమ అభిప్రాయాన్ని చెప్పారు .ఇక కేవలం 45.74శాతం మందే ఆయన పనితీరు బాగుంది ..ఓట్లు తిరిగి వేస్తామని చెప్పారు అని సదరు ఛానల్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.
see also:వైఎస్ జగన్కు పోలీసులు సైతం గులామ్..!
ఈ కథనం మీద స్పందిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరవర్గం ,రాజకీయ విశ్లేషకులు మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో వైసీపీ ,జనసేన పార్టీలోకి వెళ్తారు అని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన్ని డ్యామేజ్ చేయడం కోసమే ఇలా సర్వేల పేరిట కథనాలను బాబు పొమ్మనలేక పోగబెడుతూ ప్రచారం చేయిస్తున్నాడు అని వాళ్ళు అంటున్నారు .అయితే అనాదిగా వస్తున్నా సంప్రదాయాల మేరకు ఆయన పార్టీ మారడం ఖాయం కాబట్టి ..మంత్రి గంటా శ్రీనివాసరావు మీద ఇలా విషప్రచారం చేయిస్తున్నాడని బాబుపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.చూడాలి మరి బాబు ఆస్థాన మీడియా కథనం ప్రకారం మంత్రి గంటా ఔటో ..ఇన్నో ..