గత కొన్ని రోజులుగా యూఎస్‌లో తెలుగు హీరోయిన్ల గురించి వినిపిస్తున్న వార్తలు ఎంతలా సంచలనం సృష్టించాయో అందరికీ విధితమే. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు. ఈ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని అమెరికా పోలీసులు తీవ్రంగా పరిగణించారు. కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.
see also:రెండో కొడుకు ఫొటో షేర్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్
ఆ క్రమంలోనే అమెరికా వస్తున్న తెలుగు సినీ సెలబ్రిటీలను క్షుణ్ణంగా పరివీలించడంతోపాటు.. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు యువ హీరోయిన్ మెహ్రీన్ కౌర్‌కు అమెరికా పోలీసు అధికారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులను కలిసేందుకు యూఎస్ వెళ్లిన మెహ్రీన్ అక్కడ్నుంచి స్నేహితులను కలిసేందుకు కెనడా వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లగా అక్కడి అధికారులు తెలుగు సినీ ఇండస్ట్రీ హీరోయిన్గా మెహ్రీన్‌ను గుర్తించారు.
see also:షికాగో సెక్స్ రాకెట్‌పై శ్రీముఖి స్పందన..!
ఈ సమయంలో పోలీసు అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పానని, అమెరికాకు వచ్చింది కేవలం తన కుటుంబ సభ్యులను కలిసేందుకు మాత్రమేనని సమాధానం ఇచ్చినట్టు మెహ్రీన్ తెలిపింది.