ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. అశేశ జనవాహిని మద్య పాదయాత్ర జరుగుతుంది. గత ఎడాది నవంబర్ నెలలో కడప జిల్లా ఇడుపులపాయ నుండి ఇప్పటి వరకు ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. వైఎస్ జగన్ 192వ రోజులుగా పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్రలో వైఎస్ జగన్ తో పాటు ప్రతి రోజు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు.
see also:ఏపీ ఎన్జీవో నేతపై దాడి..చొక్కా చినిగి..స్వల్ప గాయాలు
అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. పాదయాద్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు వారి వారి సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారి సమస్యలను వింటూ.. వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.ఈ పాదయాత్రలో అక్కడ అక్కడ భారీగా వైసీపీలోకి వలసలు వచ్చారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీ విజయం అంటున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు. అయితే సోమవారం ఉదయం, కొత్తపేట నియోజక వర్గంలో గంటి గ్రామ శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించగా అప్పటికే జగన్ రాకకోసం ఆ ఊరి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు..అంతేకాదు గోడలపై.ఇంటి మిద్దెలపై జగన్ ను చూడాలని అత్రూతతో ఎదరు చూస్తండగా ఒక్కసారిగా జగన్ వారి కళ్లకు కనబడేసరికి అదిగో జగన్ అన్న అంటూ కేకలు..విజిల్స్ తో ఆ ప్రాంతం అంత మార్మోగింది. వారి ఆనందానికి అవదుల్లేవు..దీనకి ఉదాహరణే ఈ పోటో మీరే చూడండి.