టాలీవుడ్ నటి మెహరీన్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో భారీ సెక్స్ రాకెట్ నడిపిస్తున్న ఇద్దరు తెలుగు దంపతులను అక్కడి ఫెడరల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే చిత్రీకరణ నిమిత్తం మెహరీన్ ఇటీవల అమెరికా వెళ్లారు. అయితే అక్కడి ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు మెహరీన్ టాలీవుడ్ నటి అని తెలిసి ఆమెను విచారణ నిమిత్తం నిలిపివేశారట.
ఈ కేసు విషయంలో తనను దాదాపు అరగంట పాటు విచారించినట్లు మెహరీన్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘నా తల్లిదండ్రులను కలవడానికి వాంకువేర్ నుంచి అమెరికాకు వెళుతుండగా నేను టాలీవుడ్ నటిని అని తెలిసి ఇమ్మిగ్రేషన్ అధికారులను నన్ను నిలిపివేశారు. సెక్స్ రాకెట్‌కు సంబంధించి నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. దాంతో నేను షాకయ్యాను. నేను తరచూ అమెరికాకు వెళ్లి వస్తుంటాను. కానీ అక్కడ టాలీవుడ్ నిర్మాత సెక్స్ రాకెట్ నడుపుతున్న విషయం వారు చెప్పేవరకు నాకు తెలీదు. అమెరికాకు వచ్చే ప్రతీ టాలీవుడ్ నటిని విచారిస్తున్నామని తెలిపారు’ అని పేర్కొన్నారు మెహరీన్. మెహరీన్‌తో పాటు మరో ముగ్గురు తెలుగు హీరోయిన్ లను కూడా దాదాపు 6 గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది.