ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడటం అంటే ఇదేనేమో ..ఏదో తన ఆస్థాన మీడియా(ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణల ప్రకారం) ద్వారా ప్రజల్లో వైసీపీ పార్టీపై బురద చల్లి మరల తనకే ప్రజలు జై కొడుతున్నారు అని సర్వేలో తేలినట్లు ప్రసారం చేసుకుందామని చూసిన ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఏబీఎన్-ఆర్ జీ ఫ్లాష్ టీం నిర్వహించిన సర్వేలో దిమ్మతిరిగి బొమ్మ కన్పించేలా ఫలితాలు వచ్చాయి.
see also:అక్కడ వైసీపీకి తిరుగులేదు -ABN-RGఫ్లాష్ టీం సర్వే .!
గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ పాలన ఎలా ఉందని సర్వే నిర్వహించగా బాబు పాలన అసలు బాగోలేదని ఏకంగా 51.21శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు .అయితే ఆయన పాలన బాగుందని కేవలం 48.79శాతం మంది మాత్రమే అభిప్రాయాన్ని వెల్లడించారు అంట .
see also:వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి..!
అయితే ఈ ఫలితాలపై వైసీపీ శ్రేణులు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ టీడీపీ ల మధ్య ఓట్ల శాతం తేడా కేవలం రెండు శాతమే కానీ ఈ సారి ఆయన సొంత మీడియా అధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఏకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే పట్టం కడతారు ..అది మూడు శాతం మెజారిటీతో అని వారు చెబుతున్నారు.ఏది ఏమైనా కానీ తన మంత్రులకు ,ఎమ్మెల్యేలకు వందమార్కులు వేసే చంద్రబాబు పాలనకు కేవలం నలబై ఎనిమిది మార్కులు వేశారు అన్నమాట.