గులాబీ దళపతి,తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కు పొరుగు రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా వీరాభిమానులు ఉన్నారు . ఏపీలో సీఎం కేసీఆర్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉందో నిరూపించుకోవడానికి ఇది మరో తాజా ఉదాహరణ. తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలో గొల్లకురుమల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసిస్తూ.. ఇటీవలే ఏపీ యాదవ సోదరులు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సంగతి తెలిసిందే. తాజగా రేపు రంజాన్ పండుగను పురస్కరించుకొని అక్కడి ముస్లిం ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపై ఫ్లెక్స్ ,హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు.ఈ క్రమంలోనే కర్నూల్ జిల్లా లో మెయిన్ రోడ్డు పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్స్ ఒకటి ఏర్పాటు చేశారు.ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నది.ఆ ఫోటో మీకోసం..
