తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. సమాజంలోని కీలకంగా ఉన్న వికలాంగుల సమస్య కోసం ఎంపీ కవిత ఏకంగా కేంద్రమంత్రి ముందే గళం విప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన ఎంపీ కవిత కీలక ప్రసంగం చేశారు.
see also:కాంగ్రెస్‌లో కల్లోలం..నేతల చేరికలతో కొత్త వివాదం
కాచిగూడ-నిజామాబాద్ పాసింజర్ రైలును కరీంనగర్ వరకు పొడిగింపు చేసిన కేంద్రమంత్రికి ఎంపీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ నుండి కరీంనగర్ వరకు గ్రామీణ ప్రాంత వాసులకు రైలు ప్రయాణ సౌకర్యం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంత రైల్వే స్టేషన్లలో వైఫై, ఎల్ఇడి సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ A గ్రేడ్ పొందినా ఆ మేరకు మౌలిక సదుపాయాల కల్పన జరగలేదని, కల్పించాలని అధికారులను అదేశించాలన్నారు. వికలాంగ అభ్యర్థులకు రైల్వే ఉద్యోగాలలలో 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఉత్తర్వులు ఉన్నా..అమలుకు నోచడం లేదని ఎంపీ కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాబోయే నియామకాల నుంచి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు సికింద్రాబాద్ కు రైలు కనెక్టివిటీ కల్పించాలని కోరారు.
see also:ప్రధానికి సీఎం కేసీఆర్ పది వినతి పత్రాలు..అందులో ఏముందంటే..!!
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు ప్లాటినం రేటింగ్ సర్టీఫికేషన్ అవార్డు పొందడం అభినందనీయమన్నారు. తెలంగాణలో రైల్వే లైన్ల విస్తరణ కోసం రైల్వే ప్రాజెక్టుల సత్వర పూర్తికి తెలంగాణ ప్రభుత్వం, రైల్వే శాఖ కుదుర్చుకున్న ఒప్పందం వల్ల ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయని ఆశిస్తున్నామని అన్నారు.