వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తొమ్మిది జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల మస్యలను తెలుసుకుంటూ.. వాటికి పరిష్కార మార్గాలను కనుగొంటూ వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పటికే వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పూర్తయిన విషయం తెలిసిందే.
see also:కేసీఆర్, జగన్ లది సొంత జెండా ..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది..!!
ఇదిలా ఉండగా.. ప్రకాశం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఆ వీడియోలోని దృశ్యాల మేరకు వైఎస్ జగన్ ప్రసంగిస్తున్న సమయంలో పదే పదే తన చేతిని ఉదరంపై ఉంచి ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బంది పడ్డాడు. అయితే, అదే రోజున పాదయాత్ర ముగిసిన తరువాత వైద్యులను సంప్రదించిన వైఎస్ జగన్ కు.. పలు ఆరోగ్యపరమైన సూచనలు ఇచ్చారు వైద్యులు.