Home / MOVIES / స్వీటీ కి “అనుష్క “అని పేరు పెట్టింది ఎవరో తెలుసా ..?

స్వీటీ కి “అనుష్క “అని పేరు పెట్టింది ఎవరో తెలుసా ..?

అనుష్క శెట్టి అసలు సొంత పేరు స్వీటీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం గురించి స్వీటీ మాట్లాడుతూ నేను పుట్టగానే మా పిన్ని నాకు ‘స్వీటీ’ అనే పేరు పెట్టింది. మా అమ్మానాన్నలు సాయిబాబా భక్తులు. మా ఇద్దరు సోదరులకు ‘సాయి’ అనే పేరు కలిసొచ్చేలా పెట్టారు. నాక్కూడా అలాగే నామకరణం చేయాలనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో స్కూల్‌ రిజిస్టర్లలోనూ నా పేరు ‘స్వీటీ’గానే నమోదైంది. ప్లస్‌ వన్ చదువుతున్నప్పుడు తొలి రోజు ఒక సబ్జెక్ట్‌ టీచర్‌ అటెండెన్స్ తీసుకుంటూ… ‘స్వీటీ’ అని పిలిచారు. నేను లేచి నిలుచోగానే ‘స్వీటీ అని పిలవడానికి బావుంది. నీ అసలు పేరేంటి?’ అని అడిగారు. ‘అదే నా పేరు’ అని సమాధానమిస్తే అందరూ నవ్వారు. నాకు అసహనంగా అనిపించింది.

అలా నేను ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమాల్లోనూ అదే రిపీట్‌ కావడం నాకిష్టం లేదు.సూపర్ మూవీ షూటింగ్ సెట్లో అందరూ ‘స్వీటీ స్వీటీ’ అని పిలుస్తుంటే ఏం బావుంటుంది? ఆ విషయాన్ని టాలీవుడ్ మన్మధుడు ,స్టార్ హీరో నాగార్జునగారితోనూ, సోనూసూద్‌తోనూ డిస్కస్‌ చేశా. అందరూ నా అభిప్రాయాన్ని గౌరవించారు. వెంటనే మా నాన్నగారికి ఫోన్ చేసి పేరు మార్చుకోవాలనుకుంటున్నాననీ, మంచి పేరు చూడమని చెప్పా. ‘జీవితంలో తమకి తాముగా పేరు పెట్టుకునే అవకాశం ఎవరికీ రాదు. నీకు వచ్చింది. పండుగ చేస్కో. మంచి పేరు సెలక్ట్‌ చేస్కో’ అని అన్నారు.

ఒక పేరు ఎంపిక చేయడం అంత కష్టమా? అనే విషయం అప్పటిదాకా నాకు తెలియలేదు. వెబ్‌సైట్లలో చూశాను. తెలిసిన వారినడిగాను. చాలా భాషల్లో పిల్లల పుస్తకాల పేర్లు వెతికాను. చివరికి ఓ మూడు నెలల తర్వాత ఎందుకో ఒకరోజు అనుష్క అనే పేరు తట్టింది. దానికి అర్థం ఏంటో అప్పుడు నాకు తెలియలేదు. న్యూమరాలజీ వంటివీ చూపించలేదు. ‘మై నేమ్‌ ఈజ్‌ అనుష్క’ అని సన్నిహితులకు నా పేరును పరిచయం చేశాను. అందరూ ఆనందించారు. కానీ అసలు సమస్య అప్పుడే మొదలైంది. అవతలి వారు ఆ పేరు పెట్టి పిలిచేది నన్నే అని అర్థం చేసుకుని స్పందించడానికి దాదాపు ఏడాది పట్టింది. ఇప్పటికి కూడా ఎవరైనా ‘అనుష్క’ అని పిలిస్తే నేను వెంటనే స్పందించను. ఒక్క క్షణం తర్వాతే ఆ పేరు నా మెదడుకు చేరుతుంది’’ అని పేరు గురించి గుర్తుచేసుకుంది స్వీటీ ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat