Home / TELANGANA / ఈ నెల 25 లోగా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు..!!

ఈ నెల 25 లోగా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు..!!

నిర్ణిత గడువులోగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా అన్ని కార్యక్రమాలు పూర్తి కావచ్చాయనీ, ఈ నెల 25 లోగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తామని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సచివాలయంలో గురువారం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు.

see also:ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌..ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న‌స్వాగ‌తం

గత రెండు, మూడు నెలలుగా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను నిర్వహిస్తున్నామని, పూర్తి పారదర్శకంగా నిర్ణిత గడువులోగా ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామీణ బీసీ ఓటర్ల గణన పూర్తి కావచ్చిందనీ, గత పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి కూడా బీసీ లకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ ఉంటుందన్నారు. అలాగే 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న 1170 పంచాయతీలతో పాటు… మరో 1300 షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న పంచాయతీలను కూడా ఎస్టీలకే రిజర్వ్ చేయడం జరుగుతుందన్నారు.

see also:అభ్య‌ర్థుల‌కు ఇంకో గుడ్ న్యూస్ వినిపించిన టీఎస్‌పీఎస్‌సీ

ప్రతి కేటగిరిలోను మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుందన్నారు. గ్రామం యూనిట్ గా వార్డ్ మెంబర్ కు, మండలం యూనిట్ గా సర్పంచ్ ల రిజర్వేషన్లు ఉంటాయన్నారు. ఎన్నికల అనంతరం ప్రజాప్రతినిధులకు 3 నెలల పాటు నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

see also:దానికోసమే మననగరం కార్యక్రమం..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat