ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జాల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర జనసంద్రమైంది . వైఎస్ జగన్ 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర గురువారం జిల్లాలోని పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే జిల్లాలోకి వైఎస్ ప్రజాసంకల్పయాత్ర ప్రవేశిస్తుందని ఎంతో ఆశగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. కానీ జగన్ పాదయాత్రలో పాల్గొనేందుకు రాజమండ్రి వస్తున్న వారిపై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. కుమారి థియేటర్ సమీపంలో రౌండ్ మెట్లు మార్గంను రోడ్డు కం రైలు వంతెనపైకి వెళ్లే మార్గంలో ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదని సమచారం. మెట్లు శిథిలావస్థలో ఉన్నాయని సాకుగా చూపిస్తూ అక్కడికి వచ్చిన వారిని తిప్పి పంపే యత్నాలు పోలీసులు చేశారంట. అయితే వైఎస్ జగన్ అభిమానులు, మద్దతుదారులు మాత్రం పాదయాత్రలో పాల్గొనకుండా వెనక్కి వెళ్లేది లేదంటూ అక్కడే ఉండి ఆందోళనకు దిగి మరి పాదయాత్రకు వెల్లారంట. అంతేకాదు మెట్ల మార్గం వద్దకు ఎవరూ రాకుండా పోలీసులు ముళ్ల కంచెలను అడ్డుగా వేసిన వాటిని తోక్కుకుంటూ వెళ్లి మరి వైఎస్ జగన్ పాదయాత్రలో పాల్లొనరంట. అంటే వైఎస్ జగన్ అంటే ఎంత అభిమానమో తెలుస్తుంది. అలాగే టీడీపీపై ఎంత వ్యతిరేకతో కూడ తెలుస్తుంది. ఖచ్చితంగా వైఎస్ జగన్ ఏపీకి కాబోయో ముఖ్యమంత్రి అంటూ వైసీపీ అభిమానలు తెగ హల్ చల్ చేశారు.
