అసలు పొట్టదగ్గర కొవ్వు ఎందుకు పెరుగుతుంది. యోగాసనాలతో దానిని దగ్గించొచ్చా..? అసలు ఎలాంటి యోగాసనాలు వేయాలి..? తీసుకునే ఆహారం కంటే.. ఖర్చుపెట్టే శక్తి తక్కువగా ఉండటం వల్ల పొట్ట దగ్గర కొవ్వు ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అదే ఊబకాయానికి దారి తీస్తుంది. సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల కేలరీలు ఖర్చు కావు. అందులో భాగంగానే సహజమైన కారణాలతో ఆకలి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థలోనూ మార్పులు సంభవించి ఊబకాయానికి దారి తీస్తుంది. ఈ ఊబకాయం కాస్తా మరికొన్ని సమస్యలకు దారి తీస్తుంది. షుగర్, బీపీ, ఊపిరి తిత్తులు, హై కొలెస్ట్రాల్, నిద్రలేమి, అధిక రక్తపోటు, జీర్ణవ్యవస్థ సంబంధిత రోగాలకు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది.
అర్థదనురాసనం :-
ముందుగా మకరాసనంలోలాగా విశ్రాంతిగా బోర్లా పడుకుని శ్వాసతీసుకుంటూ కాళ్లు రెండు దగ్గరకు తీసుకొచ్చి చేతులు ముందుకు తీసుకు రావాలి. తిరిగి శ్వాస వదులుతూ చేతులను రెండు పక్కల నుంచి వెనక్కు తీసుకెళ్లి శ్వాస తీసుకుంటూ కాళ్లు రెండూ తొడలపైకి లేపి, అలాగే, ఛాతిని పైకి లేపుతూ వీలైతే రెండు చేతులను వెనక లాక్ చేయొచ్చు. ఈ విధంగా కనీసం రెండు సార్లు చేయాలి. ఇలా చేస్తే పొట్ట దగ్గర కొవ్వు వారం రోజుల్లో 70 శాతం కరిగిపోతుందని యోగా నిపుణులు చెబుతున్నారు.