ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగించడంలో యోగాసనాలు విశిష్ట స్థానాన్ని ఆక్రమించాయి.అయితే యోగా సాధనకు కాల నియమం ఉంది.తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళలలోనే ఆసనాలను అభ్యాసం చేస్తారు.అయితే యోగ ముద్రలకు కాలనియమం అంటూ ఏమీ లేదు.ఎప్పుడైనా ,ఎక్కడైనా ఈ ముద్రలను సాధన చేయవచ్చు.
see also:రోజూ యోగా చేస్తే ఏమవుతుందో తెలుసా..?
చేతివేళ్లు .అరికాళ్లలో మన శరీరంలోని నాడులన్నింటికికేంద్ర స్థానాలు ఉంటాయి.ఇందులో మన శరీరానికి అరచేయి.ప్రాతినిధ్యం వహిస్తుంది.
అనగా మన చేతివేళ్ళ ద్వారా ,మన శారీరక ,మానసిక ఆరోగ్యాన్ని నియంత్రించుకోవచ్చు.మన చేతి వేళ్ళు అయిధూ పంచభూతాల్లో ఒక్కోతత్వానికి సంకేతం.
see also:భార్యతో బలవంతపు శృంగారం..అసహజ శృంగారం చేస్తే
చిటికెన వేలు జల తత్వం,
ఉంగరపు వేలు పృధ్వీత్వం
బొటన వేలు అగ్నిత్వం ఇలా ఒక్కో వేలు ఒక తత్వాని చూపిస్తుంది.
చేతి కోసల మధ్యలో ,కానపు వద్ద ,మూలాలలో బొటనవేలి తో కలపడం లేదా దగ్గరగా ఉంచడం వలన ఎన్నో ముద్రలు తయరవుతాయి.ఈ ముద్రల సాధన చేయడం వలన ఒక్కోరకమైన ఫలితం వస్తుంది.మనిషి రుగ్మతను బట్టి ఆయా తత్వాలను నియంత్రించడం యోగా ముద్రలతో సాధ్యపడుతుంది.వీటిని సాధన చేసే కొద్ది వీటీ ప్రయోజనాలు అనుభవంలోకి వస్తాయి.వాటిలో కొన్ని సులభమైన ముద్రలను ఇప్పుడు చూద్దాం.
జ్ఞానముద్ర : దీనిని చిన్మద్ర అని కూడా అంటారు. చూపుడు వేలు ,బొటనవేలి కొసను కలిపి ఉంచాలి.ఈ ముద్ర మానోశక్తి ని ,ఏకాగ్రతను పెంచుతుంది.
ప్రాణ ముద్ర :
ఉంగరం వేలు,చిటికెన వేలు రెండిటినీ బొటన వేలితో జత చేస్తే అది ప్రాణ ముద్ర అవుతుంది.ఈ ముద్ర వలన మనిషిలో చురుకుదనం ,రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అపాన ముద్ర
మధ్యవేలు ,ఉంగరం వెళ్ళాను బొటనవేలి తో జతచేయాలి.ఈ ముద్ర వలన ముత్ర సంబంధిత సమస్యలు తొలిగిపోతాయి.
పృధ్వీ ముద్ర
ఉంగరం వేలు,బొటనవేలి కోణాలను కలిపితే వచ్చేది పృధ్వీ ముద్ర,శరీర బలహీనతను పోగొడుతుంది.చర్మం కాంతిని పెంచుతుంది.
వరుణ ముద్ర
దీన్నే జలముద్ర అని కూడా అంటారు.చిటికెనవేలు,బొటనవేలు కొనలను కలిపితే అది వరునముద్ర.ఈ ముద్ర చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
అగ్ని ముద్ర :
దీన్నే సూర్య ముద్ర అని కూడా పిలుస్తుంటారు.
బొటన వేలితో ఉంగరం వేలు మధ్యబాగాన్ని పట్టుకోవాలి ఇది శరీర బరువును తగ్గిస్తుంది.శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ను కరిగిస్తుంది.