నానీ, మన విషయం మీ ఆవిడకు చెప్పావా..? నీవు చేసిన వెధవ వేషాలకు ఆ దేవుడే నీకు సరైన శిక్ష విధిస్తాడు అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా, ఇటీవల కాలంలో అన్ని సినీ ఇండస్ట్రీలతో పోల్చితే టాలీవుడ్‌లోనే కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎక్కువ అయ్యాయని, మహిళలపై, యువతులపై, చిన్నారులపై సినీ ప్రముఖులు లైంగిక దాడులు చేస్తున్నారని, అవన్నీ ఆగే వరరకు తన పోరాటం ఆగదని ఇటీవల కాలంలో పలు సోషల్ మీడియా ఛానెళ్లలో శ్రీరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
see also:బ్రేకింగ్ : శ్రీరెడ్డి కి షాక్ ఇచ్చిన నాని..!!
అంతేకాకుండా, టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కూడా తనను శారీరకంగా, లైంగికంగా అనుభవించాడని, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పాడని, కానీ చివరకు వదిలేశాడంటూ శ్రీరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు టాలీవుడ్ బఢా నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు కుమారుడు అభిరామ్ రాసలీలలను లీక్ చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం నాని రాస లీలలను బయటపెడుతానని శ్రీరెడ్డి చెప్పింది. ఇలా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ప్రముఖుల్లో అలజడి రేపుతున్నాయి.
see also:జాతీయ మీడియా సంచలన కథనం..!!
అయితే, సోమవారం నేచురల్ స్టార్ నాని శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తనకు వచ్చింది లీగల్ నోటీసు కాదని, బెదిరింపు లెటర్ అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. నాని ఇలాంటి నోటీసులు ఎన్ని పంపించినా.. నీ రాసలీలలను బయటపెట్టే తీరుతానంటూ శ్రీరెడ్డి సవాల్ చేసింది. సినీ ఇండస్ట్రీలోన మహిళలకు పూర్తి రక్షణ దొరికే వరకు, అలాగే, నాతో నీవు కొనసాగించిన రాసలీలను బయటపెట్టే వరకు ఫైట్ చేస్తూనే ఉంటానంటూ శ్రీరెడ్డి పేర్కొంది.
see also:భారతీయ సినిమాలన్నీ మహిళల నడుము ,అందం చుట్టే తిరుగుతాయి ..!