టాలీవుడ్లో ప్రముఖ నటుడిగానే కాకుండా, ఓ పక్క దర్శకుడిగా మరో పక్క నిర్మాతగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో రాణిస్తున్న వ్యక్తుల్లో పోసాని కృష్ణ మురళీ ఒకరు. మనసులో ఉన్న మాటను నిక్కచ్చిగా, తన ఎదుట ఎవరు ఉన్నారన్న విషయాన్ని కూడా లెక్క చేయకుండా బయటపెట్టగల వ్యక్తుల్లో పోసాని కృష్ణ మురళీ ఒకరు.
see also:జగన్ మగాడు ..బాబు రాజకీయ బ్రోకర్ -పోసాని కృష్ణమురళి ..!
అయితే, ఇవాళ హైదరాబాద్ నగర పరిధిలోగల సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేస్తున్న పాదయాత్రలో పోసాని పాల్గొన్న విషయం తెలిసిందే. అదే సమయంలో జరిగిన ఓ సంఘటనను పోసాని మీడియాకు చెప్పుకొచ్చారు.
see also:చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పోసాని .!
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నేను కూడా జగన్ వెంట నడిచాను. ఆ సమయంలో జగన్‌కు.. అన్నా.. నాదొక సలహా.. అని జగన్‌తో చెప్పా. వెంటనే చెప్పు మురళీ అని జగన్ అన్నారు. అన్నా నీవు రైతు రుణమాఫీ అన్న ఒక్క హీమీ ఇవ్వు అన్నా.. అని చెప్పడంతో జగన్ తనతో ఏమన్నాడో మీడియాకు చెప్పాడు పోసాని కృష్ణ మురళీ.
see also:పచ్చమీడియాకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన విశాల్..!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులా నేను మోసపూరిత హామీలు ఇవ్వలేను మురళీ. అసలే, రాష్ట్ర విభజన జరిగి ఏపీ అప్పుల్లో ఉంది. 2014 ఎన్నికల్లోలాగా చంద్రబాబులా దొంగ హామీలు ఇచ్చి గెలవడం నాకు ఇష్టం లేదు. ప్రజలంటే నాకు ఇష్టం. రుణమాఫీ ఇచ్చిన చంద్రబాబును ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారో తెలుసు కదా..? చంద్రబాబులా వెన్నుపోటు రాజకీయాలు, అబద్ధపు హామీలు ఇచ్చే రాజకీయాలు వైసీపీ చేయదన్నారు. అని జగన్ తెలిపారని పోసాని కృష్ణ మురళీ మీడియాకు చెప్పారు.