రాంచీ లో నేడు టీంఇండియా ,ఆసీస్ ల మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. తొలుత టాస్ నెగ్గిన టీంఇండియా సారథి కోహ్లీ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆ జట్టు 18.4 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 118 పరుగులు చేసిన క్రమంలో వర్షం అంతరాయం కలిగించింది.
టై(0), జంపా(4) క్రీజులో ఉన్నారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 8 పరుగుల వద్ద కెప్టెన్ వార్నర్(8) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ ఫించ్(42) రాణించగా.. ఆ తర్వాత వచ్చిన మాక్స్‌వెల్(17), హెడ్ (9), హెన్రిక్స్(8), క్రిస్టియన్(9), పెయిన్(17), నైల్(1) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు.
ఐదుగురు బ్యాట్స్‌మెన్లు క్లీన్‌బౌల్డ్ కావడం మరో విశేషం. ఇక టీంఇండియా బౌలర్లలో కుల్‌దీప్ 2, బుమ్రా 2, భువనేశ్వర్, పాండ్య, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.