ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 186కు చేరుకుంది. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోగల గౌరపల్లి గ్రామం నుంచి వైఎస్ జగన్ ఇవాళ పాయాత్రను ప్రారంభించారు. జగన్‌తోపాటు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
see also:వైసీపీలోకి మొన్న గంగుల,నిన్న శిల్పా బ్రదర్స్..నేడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి…కోట్ల సుజాతమ్మ
ఇదిలా ఉండగా, జగన్ ప్రజా సంకల్ప యాత్ర 185వ రోజు పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరం గ్రామంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్‌కు సంబంధించిన సంచలన నిజాలను వెల్లడించారు. హైకోర్టు మాజీ జడ్జీ ఈశ్వరయ్య గౌడ్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలపై చంద్రబాబు సర్కార్ ఎలా కక్ష సాధింపు చర్యలను తీసుకుందో జగన్ వివరించారు. అమర్‌నాథ్ గౌడ్‌పై కేంద్ర ప్రభుత్వంలోని న్యాయ మంత్రిత్వ శాఖకు అబద్ధపు లేఖను పంపించిందన్నారు. అమర్‌నాథ్‌రెడ్డిని జడ్జీగా నియమించేందుకు అతనికి ఇంటెలెక్చువల్ క్యాలిబర్, పర్సనల్ ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ లేదని, అతన్ని జడ్జీగా నియమించేందుకు అర్హతలు లేవని సీఎం చంద్రబాబు కేంద్రంలోని న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారని జగన్ చెప్పారు. అందుకు సంబంధించిన లేఖలను కూడా జగన్ మీడియా ముందు ఉంచారు. ఇదీ బీసీలపై చంద్రబాబు ప్రేమ.