టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాం లో ఫిజిక్స్ ఉంటుంది అని గతంలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి జలీల్ ఖాన్ వార్తల్లోకి ఎక్కారు. జలీల్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది.ఇవాళ విజయవాడ నగరంలోని నైజాం గేట్ సెంటర్లో రోడ్ల విస్తరణ పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వచ్చారు.
ప్రారంభోత్సవ సందర్భంగా శిలాఫలకం వద్ద తెలుగుదేశం పార్టీ నేతలతో అయన కొబ్బరికాయలు కొట్టించారు. దీంతో ప్రొటోకాల్‌ను పట్టించుకోకుండా టీడీపీ నాయకులతో ఎలా కొబ్బరికాయ కొట్టిస్తారని ఎమ్మెల్యేను వించ్ పేట వైసీపీ కార్పొరేటర్ జాన్‌బీ ప్రశ్నించారు.ఈ డివిజన్లో నువ్వు పని చేయొద్దు అని జలీల్ ఖాన్ జాన్ బీను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఒక డివిజన్లో ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్‌ను ఎలా పని చేయొద్దని ఆదేశిస్తారని జాన్ బీ జలీల్ఖాన్ను కడిగేసింది.మహిళలన్న కనీసం గౌరవం లేకుండా మాట్లాడుతారా ..? అని ప్రశ్నించింది.దీంతో ఆగ్రహించిన జలీల్ ఖాన్ జాన్ బీపైకి దూసుకొచ్చారు.జాన్ బీ జలీల్ఖాన్ను పబ్లిగ్గా నిలదీయడంతో అయన కారెక్కి వెళ్ళిపోయారు.
డివిజన్లో పనిచేయవద్దని చెప్పిన ఎమ్మెల్యే జలీల్ఖాన్ను పబ్లిక్‌గా నిలదీసిన వించ్‌పేట కార్పొరేటర్ జాన్‌బీ#TDP #JaleelKhan #Vijayawada
Publiée par YSR Congress Party – YSRCP sur samedi 9 juin 2018