వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, అవి తనను చాలా బాధించాయని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. కాగా, మంత్రి జవహర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి.. నీ కుటుంబ నేపథ్యం నీకేమన్నా గుర్తుందా..? లేక మరిచిపోయావా..? అని ప్రశ్నించారు.
మీ తాత అనంతపురంలో ఉన్నటువంటి అమాయకులను దొంగతనాలవైపు మళ్లించి, వారిని చిత్ర హింసలకు గురిచేసిన విషయం మరిచిపోయావా..? లేక, మీ నాన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెన్నారెడ్డిని హత్య చేయించిన విషయం మరిచిపోయావా..? అంటూ ప్రశ్నించారు. హత్యల రాజకీయాలు మీవి, మీ తాత, నాన్న హత్యలు చేయించి పదవులు పొందితే.. నీవు ఇంకోమెట్టు పైకెక్కి సుటు కేసుల రాజకీయాలు మొదలుపెట్టావు అని ఎద్దేవ చేశారు.