భారతీయ జనతా పార్టీ కి ఉహించని షాక్ తగిలింది.గత కొన్ని రోజులుగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపి కి ఎదురు గాలి వీస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఆ పార్టీ చేయించుకున్న అంతర్గత సర్వేలో గత ఎన్నికల్లో గెలిచిన 282 లోక్ సభ సీట్లలో 152 స్థానాల్లో పరిస్థితి మంచిగ లేదని తేలింది.
దీన్ని బట్టి ఉత్తరాదిలో బీజేపి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటోందని తేలింది.గత ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో 71 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. కానీ ఈ సర్వే ఫలితాల్లో ఈసారి మాత్రం అక్కడ 48 సీట్లు కోతపడబోతున్నాయని సర్వేలో తేలింది.
.అయితే ఈ సర్వే ఫలితాలను చూసి ప్రధాని మోదీ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కంగుతిన్నారు.సర్వేను ఉటంకిస్తూ ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ కథనాన్ని ప్రచురించింది. దీంతో నష్టనివారణ కోసం ఆరెస్సెస్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మంత్రాంగం జరుపుతున్నారు.