పక్కోడు కష్టాల్లో ఉన్నాడని తెల్సిన కానీ సాయం చేయడానికి వెనకడుగేసే వారున్న రోజుల్లో బ్రతుకుతున్నాం .అట్లాంటిది ఆయన మరణం అంచులో ఉన్న కానీ ఎదుటివాళ్ళకు సాయం చేయడానికి ముందుకొచ్చిన యదార్ధ సంఘటన ఇది.
ఏపీలోని గుంటూరు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికీ అధిక రక్తపోటుతో బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లారు .ఆయన తిరిగి కోలుకునే అవకాశం లేదు అని వైద్యులు తెగేసి చెప్పారు .
దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆంజనేయులు అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు.ఈ క్రమంలో తమ ఆత్మీయుడు చనిపోతున్న బాధలో ఉండి కూడా మంచి పని చేయడానికి ఒప్పుకున్నా అతని కుటుంబ సభ్యులపై ప్రశంసలు కురిపిస్తున్నారు
స్థానికులు .. .