టాలీవుడ్ స్టార్ హీరోలు ఎప్పటికీ సన్నిహితంగానే ఉంటారు. ఒకదారిలో వెళుతున్న పక్షులు కాబట్టి పలకరించుకోకుండా ఎలా ఉంటాయి..? మంచి స్నేహంతో ఉండటం, సన్నిహితులతో మెలగడం వారికి అలవాటే. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి.. జనాలకు ఎక్కువ తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు స్టార్ హీరోల సాన్నిహిత్యం గురించి చాలా క్లియర్‌గా అర్థమవుతోంది.
see also:నేను ఒక నటుడ్ని గుడ్డిగా ప్రేమించా -సమంత షాకింగ్ కామెంట్స్.ఎవరా నటుడు ..!
టాలీవుడ్లో కొన్ని స్టార్ గ్యాంగ్స్ ఉన్నాయని అందరికీ తెలిసిందే. అందరికంటే ఎక్కువగా గత ఏడాది నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కువగా కనిపిస్తున్నారు. వారిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తూ అభిమానులకు మంచి ఫీలింగ్‌ను ఇస్తున్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్ చరణ్‌ల ఫోటోను పోస్ట్ చేసి అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. చరణ్ కనిపించిన ఫోటోలో.. సీనియర్ ఎన్టీఆర్ స్పెషల్ ఫోటో ఉండటం అందరినీ ఆకట్టుకుంది.
see also:‘దేశంలో దొంగలు పడ్డారు’ టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్