తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాల కోసం కృషి చేసే అభ్యర్థులకు తమ తోడ్పాటునందించేందుకు టి-సాట్ మరో సారి సిద్ధమైంది.పోలీసు శాఖ 18,428, పబ్లిక్ సర్వీసు కమిషన్ భర్తీ చేసే 2,786 ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ప్రసారాలను అందించాలని నిర్ణయించింది. జూన్ 11న పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాస్ రావు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంతో ప్రసారాలు ప్రారంభమౌతాయి. రెండు నెలలు సుమారు 400 గంటలు, 15 సబ్జెక్టుల్లో ప్రసారాలను అందించనుండగా అవగాహన ప్రసారాలను టి-సాట్ సోషల్ మీడియాలోనూ అందుబాటులో ఉంటాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాల కోసం కృషి చేసే అభ్యర్థులకు తమ తోడ్పాటునందించేందుకు టి-సాట్ మరో సారి సిద్ధమైంది.పోలీసు శాఖ 18,428, పబ్లిక్ సర్వీసు కమిషన్ భర్తీ చేసే 2,786 ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ప్రసారాలను అందించాలని నిర్ణయించింది. జూన్ 11న పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాస్ రావు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంతో ప్రసారాలు ప్రారంభమౌతాయి. రెండు నెలలు సుమారు 400 గంటలు, 15 సబ్జెక్టుల్లో ప్రసారాలను అందించనుండగా అవగాహన ప్రసారాలను టి-సాట్ సోషల్ మీడియాలోనూ అందుబాటులో ఉంటాయి.
see also;సామాన్యులకు పైసా ఖర్చు లేకుండా.. వైద్య పరీక్షలు..మంత్రి కేటీఆర్
టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు పోలీసు-పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉద్యోగ గైడ్ పేరుతో చేయనున్న అవగాహన ప్రసారాలకు సంబంధించి సీఈవో ఆర్.శైలేష్ రెడ్ది శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలను వెళ్లడించారు. పేద, మారు మూల ప్రాంత అభ్యర్థుల కోసం టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు నిపుణ-విద్యలో ఈ నెల 11వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాస రావుతో అవగాహన కార్యక్రమాలు ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభం కానున్నాయన్నారు. పోలీసు నియామక బోర్డు ద్వార భర్తీ చేసే ఎస్,ఐ., కానిస్టేబుల్ తో పాటు ఇతర ఉద్యోగాలు, పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆధ్వర్యంలో భర్తీ చేసే రెవెన్యూ శాఖలోని వీఆర్వో, ఏఎస్ఓలతో పాటు అటవీ, వైద్య ఆరోగ్యశాఖ, హోం, సాగునీటి ఇతర శాఖలకు సబంధించిన ఉద్యోగాల కోసం టి-సాట్ టీవీ ప్రసారాలను అందించనుందన్నారు. ఈ ప్రసారాలు జూన్ 11వ తేదీన ప్రారంభమై 12వ తేదీన ఉదయం ఏడు గంటల నుండి 10 గంటల వరకు మూడు గంటలు, సాయంత్రం ఐదు గంటల తొమ్మిది గంటల వరకు నాలుగు గంటల వరకు ఉంటాయని శైలేష్ రెడ్డి వివరించారు.
see also:నాగలి పట్టి ..దుక్కి దున్నిన స్పీకర్
ప్రతి రోజు ఏడు గంటల పాటు జరిగే ప్రసారాలు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్ తో పాటు మరో 11 సబ్జెక్ట్ ల్లో సుమారు 60 రోజులు, 400 గంటలు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అందించనున్నామని సీఈవో తెలిపారు.ప్రసారాలను పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలోనూ…టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు తెలంగాణ ప్రజలకు ఆర్వోటీలు, కేబుల్ నెట్వర్క్ లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ సేవలందిస్తున్న విషయం ప్రేక్షకులకు విధితమేనని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి గుర్తు చేశారు. టి-సాట్ టీవీకి సంబంధించి యూట్యూట్ www.youtube.com, పేస్ బుక్ www.facebook.com/tsatnetwork, ట్విట్టర్ www.twitter.com/tsatnetwork, వెబ్ సైట్ www.softnet.telangana.gov.in/, టి-సాట్ యాప్ www.tsat.tv లలో ప్రసారాలను వీక్షించవచ్చని కోరారు. గతంలో టి-సాట్ టీవీ చేసిన ప్రసారాలను విస్త్రుతంగా ఆదరించి లబ్ది పొందిన తెలంగాణ ప్రజలు ప్రస్తుత ప్రసారాలనూ వినియోగించుకుంటారని ఆశా భావం వ్యక్తం చేశారు.