ఏపీలో గత నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షం వైసీపీ పార్టీ శుక్రవారం ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. టీడీపీ సర్కార్‌లో అభివృద్ధి శూన్యమని, అందువల్లే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ విడుదల చేస్తున్నామని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందే తప్ప, అంగుళం కూడా అభివృద్ధి లేదు. ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ దగ్గర నుంచీ, కీలక పాత్ర నిర్వహిస్తున్న వెంకయ్య నాయుడు దగ్గర నుంచీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, సీఎం కావాలని ఉవ్విళ్లు ఊరుతున్న చంద్రబాబు వరకూ ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు, పదేళ్లు …కాదు పదిహేనేళ్లు కావాలని డిమాండ్ చేశారు. హోదా స్థానంలో ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు మాట్లాడారు.
see also:
see also:ఎన్నాళ్ళో వేచి చూసిన తరుణం ..ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త ..!
see also: