ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 183వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో జగన్ తన పాదయాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లిన అక్కడి ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు.
see also:వైఎస్ జగన్‌పై వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు..!
అయితే, జగన్ పాదయాత్ర నేపథ్యంలో పలు సంస్థలు సర్వే చేశాయి. ఆ సర్వేల్లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ప్రభంజనం సృష్టించనున్నారని, వైసీపీ అధికారం చేపడుతుందని తేల్చి చెప్పారు. దీంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో కొందరు నాయకులు అధికార పార్టీ టీడీపీని సైతం కాదని.. వైసీపీలో చేరారు.
see also:2019 ఎన్నికలు.. నెల్లూరు జిల్లాలో వైసీపీకి 10/10..!
ఈ నేపత్యంలోనే కర్నూలు జిల్లా టీడీపీ నేత, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి వైసీపీలో చేరబోతున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే, ఇటీవల చంద్రబాబు కర్నూలు పర్యటనకు బీసీ జనార్ధన్‌రెడ్డి హాజరు కాకపోవడమే ఇందుకు కారణం. అందులోనూ, మంత్రి అఖిల ప్రియకు, తనకు అస్సలు పొసగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీసీ జనార్ధన్‌రెడ్డి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేచేశాడు. అయితే, చంద్రబాబు మాత్రం మంత్రి అఖిల ప్రియకే ప్రాధాన్యత ఇవ్వడంతో చేసేదిలేక బీసీ జనార్ధన్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
see also:ఎయిర్ ఏషియా కుంభకోణం.. కేంద్ర మాజీ మంత్రికి చంద్రబాబు ఫోన్..!