తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ముఖ్యంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. అందులోభాగంగానే రైతు బంధు పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. గవర్నర్ నరసింహన్ ప్రధానితో భేటీ అయిన సందర్భంగా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అటు గవర్నర్ నరసింహన్ ప్రధానికి పథకం అమలు తీరును వివరించారు.ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ నరసింహన్ 50 నిమిషాల పాటు భేటీ అయ్యారు.
see also:ఎంపీ సంతోష్ కుమార్ కు అరుదైన గౌరవం..!!
ఈ సమావేశంలో మోదీ రైతుబంధు పథకం గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి 8 వేల పంట పెట్టుబడి సహాయం అందిస్తున్నట్టు గవర్నర్ ప్రధానికి వివరించారు. ఈ పథకం విజయవంతంగా ప్రారంభం అయ్యిందని రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. దీంతో పాటు రైతు జీవితబీమా పథకాన్ని ఆగష్టు 15 నుంచి అమలు చేయనున్నట్టు ప్రధాని మోడీకి, గవర్నర్ నరసింహన్ వివరించారు.ఈ సందర్భంగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాల తీరుపై ప్రధాని మరీమరీ అడిగి తెలుసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
see also:అయన చెప్పిన మాటకు…జానా, కోమటిరెడ్డి మైండ్ బ్లాంక్