ఉపాసన. మెగా కుటుంబం కోడలిగా, రామ్ చరణ్ భార్యగానే కాకుండా ఉపాసనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆరోగ్యం విషయంలో ప్రజలను చైతన్య పరుస్తూ అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. అంతేకాకుండా, వెయిట్ తగ్గండి అంటూ సందేశాత్మక వీడియోను పెట్టడమే కాకుండా, వెయిట్ ఎలా తగ్గాలో తాను చేసి చూపించింది. దీంతో వెయిట్ తగ్గే విషయంలో పలువురికి ఉపాసన ఆదర్శమైంది.
see also:
సిగరేట్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంత నష్టం జరుగుతుందో.. ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల అంతే నష్టం జరుగుతుందని, అందుకని ప్రతీ నిమిషం కదులుతూ ఉండాలని మెగా అభిమానులకు సూచించింది. మిస్టర్ సీ కూడా ఫోన్ మాట్లాడే సమయంలో నడుస్తూ మాట్లాడుతాడని చెప్పుకొచ్చింది. అయితే, ఇతరులకు సలహాలు ఇచ్చే ముందు నువ్వు పాటించు అన్న సామెత ప్రకారం.. ఉపాసన జిమ్‌లో కష్టపడుతూ.. మెగా అభిమానులకు ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచుతోంది. అయితే, జిమ్‌లో ఉపాసన చేస్తున్న ఎక్సర్‌సైజ్ ఫోటోలు ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ అయ్యాయి.