ఏపీలో టీడీపీ దగ్గర బలిసిన కార్యకర్తలున్నారని, నదుల్లో ఇసుక తిన్నవాళ్లు, చెరువుల్లో మట్టి తిన్నవాళ్లు వాళ్ల దగ్గర ఉన్నారని వైసీపీ పార్టీ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఆయన ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ టీడీపీ వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు 15 న్యూస్ ఛానళ్లున్నాయని అదే వైసీపీకు కార్యకర్తలే ప్రచార కర్తలని,వారే బలం అని ఆయన అన్నారు. అందువల్ల ప్రజల్లోకి కార్యకర్తలే విస్తృతంగా పార్టీని తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే రాష్ట్రం చీలేది కాదు. చంద్రబాబు గెలిచేవాడు కాదు. ప్రత్యేక పరిస్థితుల్లో వైసీపీ ఆవిర్భవించింది. వైఎస్ జగన్ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు పిరికిపందలా స్టేలు తెచ్చుకున్నారు. ఓటమి కూడా మంచిదేనోమో.. ఇవాళ దేశవ్యాప్తంగా ఇంతటి ప్రజాదరణ పొందిన నేత మరెవ్వరూ లేనంతగా వైఎస్ జగన్ ఎదుగుదలకు తోడ్పడింది. చంద్రబాబు ఇచ్చే డబ్బు మనదే. ఆ డబ్బు తీసుకుని మీ ఇష్టం వచ్చిన వాళ్లకు ఓటు వేయాలని ప్రజలకు చెప్పండి’ అని రాంబాబు అన్నారు.
see also…