గ్రూప్ 4 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది.గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అర్హత కోల్పోతున్నాం అంటూ కొంత మంది వయో పరిమితి సడలింపును కోరారు. దీనిపై స్పందించినరాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది. గ్రామ రెవెన్యూ అధికారి (VRO), గ్రూప్–4, మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు పదేళ్ల వయో పరిమితి సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి లెక్కింపును 2018 జూలై 1వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది.
జనరల్ అభ్యర్థులకు సాధారణ గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుకాగా.. సడలింపుతో 44 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి వర్తిస్తుంది. దీనికి ఆయా రిజర్వేషన్లతో అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.SC,ST,BC అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మన్‌లకు మూడేళ్లు, NCC వారికి మూడేళ్లు, వికలాంగులకు 10 ఏళ్ల వరకు అదనపు ఏజ్ సడలింపు వర్తిస్తుంది. ఆర్టీసీలోని 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం సాధారణ గరిష్ట వయోపరిమితికి, ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కలుపుకుని జనరల్ అభ్యర్థులకు 40 ఏళ్లు గరిష్ట వయోపరిమితి ఉంటుందని TSPSC స్పష్టం చేసింది.