డోన్- గుంటూరు ప్యాసింజర్ రైలులో దారుణం చోటు చేసుకుంది. రైలు గార్డు కేవీ రావు బాత్రూంలో రక్తపుమడుగులో పడి ఉన్నారు. గుండ్లకమ్మ రైల్వేస్టేషన్ వద్ద బాత్రూంలను పరిశీలిస్తుండగా ఈ సంఘటన వెలుగు చూసింది. దీంతో కేవీ రావు మృతదేహాన్ని అదే రైలులో నరసరావుపేటకు తరలించారు. కాగా, రావు తలకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో ఎవరైనా చంపి బాత్రూంలో పడేసి ఉంటారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
