ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేప్టటిన ప్రజా సంకల్ప యాత్ర అన్ని వర్గాల ప్రజల ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ఇవాళ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర 179వ రోజును పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో కొనసాగించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆచంట నియోజకవర్గం పెనుగొండలో బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. 2014 ఎన్నికల సందర్బంగా చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ జరగలేదన్నారు.
అనంతరం త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొట్ట మొదటి ఎమ్మెల్సీగా శ్రీనుకు టిక్కెట్ ఖరారు చేస్తున్నట్టు జగన్ చెప్పారు.