తెలంగాణ రాష్ట్ర తోలి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ,మార్కెటింగ్ ,శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు 45వ పుట్టిన రోజు వేడుకలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ,ప్రాజెక్టుల దగ్గర టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు కేకులు కట్ చేసి ..అన్నదానాలు ,రక్తదానాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు .
ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు అధికారక నివాసం అయినా మంత్రుల నివాససముదాయంలో ఉదయం ఏడున్నర గంటల నుండి గులాబీ శ్రేణులు ,తన్నీరు అభిమానులు కోలాహలం మొదలైంది .దాదాపు రెండు నుండి మూడు కిలో మీటర్ల పొడవునా ప్రజలు బారులు తీరారు .అయితే ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరోళ్ల శ్రీనివాస్ ,టీఆరెస్వీ సీనియర్ నాయకుడు సంతోష్ రెడ్డి సమక్షంలో వేలాది మంది అభిమానుల ,గులాబీ శ్రేణుల సాక్షిగా మంత్రి హరీష్ రావు కేకు కట్ చేశారు .ఈ క్రమంలో పలువురు మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ లు ,పార్టీ శ్రేణులు ,కార్యకర్తలు ,అభిమానులు శుభాకాంక్షలు వర్షం కురిపించారు .
మంత్రి హరీష్ రావు తన కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కర్ని ఆప్యాయంగా పలకరించి అందరికి సెల్ఫీ లు ఇచ్చి నవ్వుతూ పలకరించారు .మంత్రికి శుభాకాంక్షలు చెప్పిన వారు ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ ,మంత్రులు పోచారం ,జగదీశ్ రెడ్డి ,ఈటల ,ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు ,తీగల కృష్ణారెడ్డి ,గాంధీ ,ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి ,బూర వెంకట నర్సయ్య గౌడ్ తదితరులు ఉన్నారు ..