తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం , ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ ఛైర్మన్ , తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు.
ఎంపీ పొంగులేటి పై బురద జల్లేందుకే అసత్య ప్రచారం..
అనంతరం తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజ్యాంగ పరమైన రాజకీయ పోరాటం చేసి, గాంధేయ మార్గంలో స్వరాష్ట్రం సాధించిన పోరాట యోధుడు కే.సీ.ఆర్ గారని ఆయన అన్నారు.
ఆస్ట్రేలియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..!
నూతన రాష్ట్రం అయినప్పటికీ దేశం లోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణా రాష్ట్రం దూసుకుపోతున్నదని , ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ఆయన గుర్తు చేశారు. “రైతు బంధు” పథకం తో కే.సీ.ఆర్ గారు ” పేగు బంధం” పెనవేసుకున్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మేకల అనలా రెడ్డి , అడ్ హాక్ కమిటీ మెంబర్ మేకల హన్మంత్ రెడ్డి , తెరాస నాయకులు బన్నాల ప్రవీణ్, విక్రం రెడ్డి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.