టాలీవుడ్, కోలీవుడ్‌లో మాంచి ఫేమస అయిన త్రిష ఇటీవల పెళ్లి చేసుకోనన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మధ్య వరుణ్ అనే వ్యక్తితో నిశ్చితార్ధం జరిగినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది రద్దయింది. ఇటీవల తమిళనాడుకు చెందిన ఒక బిజినెస్ మెన్‌తో త్రిష ప్రేమ వ్యవహారం నడుపుతుందనే వార్తలు వచ్చాయి.
అయితే, సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలను త్రిష ఖండించింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని తెలిపింది. నాకు నచ్చిన వ్యక్తి దొరకగానే అందరికి చెప్పే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ప్రేమ పెళ్లి చేసుకుంటానని తెలిపింది.