ఆ విషయం తెలియగానే జగన్ వద్దకు భారతి హుటాహుటిన వచ్చి..?
కొంచెం జ్వరం వస్తేనే వారం రోజులపాటు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాం..అలాంటిది మండుటెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలకోసం ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గత మూడు రోజులనుండి తీవ్ర జ్వరం,తలనొప్పితో భాధపడుతున్నారు. తీవ్ర ఎండలు, వేడికారణంగా అనారోగ్యానికి గురయ్యారని అక్కడి వైద్యులు చెప్పారు.
అయితే మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినా.. జగన్ వినకుండా బుధవారం పాదయాత్ర కొనసాగించారు.ఈ క్రమంలోనే ఆ జ్వరం కాస్తా ఎక్కువ అయింది.దీంతో వైద్యుల సూచన మేరకు జగన్ గురువారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఆయన సరిపల్లిలోని శిబిరంలోనే గురువారమంతా విశ్రాంతి తీసుకున్నారు. అయితే జగన్ కు తీవ్ర అస్వస్థత అని తెలియడంతో ఆయన సతీమణి వైఎస్ భారతి వచ్చి జగన్ వద్దనే నిన్నంతా ఉన్నారు.
ఒకరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత జగన్ కొద్దిగా జ్వరం తగ్గడంతో పాదయాత్రను తిరిగి ఈరోజు ప్రారంభించారు. ఈరోజు జగన్ పాదయాత్ర పాలకొల్లు నియోజకవర్గంలో జరగనుంది.