ఇటీవల విడుదలైన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాల్లో నూట నాలుగు స్థానాలను గెలిచి మరి పెద్ద పార్టీగా అవతరించిన కానీ బీజేపీ పార్టీ అధికారాన్ని చేపట్టలేకపోయిన సంగతి తెల్సిందే .
అయితే ఆ విషయం మరిచిపోకముందే ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది .ఈ నెల పన్నెండో తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో నకిలీ ఓటర్ల జాబితాల కారణంగా వాయిదా పడిన రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే .
అయితే ఈ రోజు గురువారం దేశ వ్యాప్తంగా మొత్తం పది అసెంబ్లీ ,నాలుగు ఎంపీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు విడుదలయాయ్యి .ఈ నేపథ్యంలో రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న బీజేపీ అభ్యర్థి తులసి మునిరాజ్ గౌడ్ మీద నలభై ఒక్క వేల నూట అరవై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొంది బీజేపీ పార్టీకి బిగ్ షాకిచ్చారు .