జన్మనిచ్చిన కన్న తల్లినే మరిచిపోతున్న ఈ రోజుల్లో..పుట్టి , పెరిగి విద్యాబుద్దులు నేర్చుకొని ఒక స్థాయికి ఎదిగి తన జన్మభూమిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే దృడ సంకల్పంతో తను పుట్టిన ఉరిని దత్తత తీసుకున్న రియల్ శ్రీమంతుడు తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ యువనేత ,జూలపల్లి సింగిల్ విండో చైర్మన్ నల్లా మనోహర్ రెడ్డి.ఈయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామం.యూకేలో చాలా కాలం ఉండి సాఫ్ట్ వేర్ రంగం లో ఉద్యోగంతో ఆర్ధికంగా ఎదిగిన నల్ల మనోహర్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో తిరిగి తెలంగాణకు వచ్చారు.
SEE ALSO : మానవత్వం చాటుకున్న గొప్ప ఔదార్యుడు… నల్ల మనోహర్ రెడ్డి
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కీలక పాత్ర పోషించారు.ఉద్యమంలో విద్యార్ధులను చైతన్యవంతం చేశారు.అనంతరం మనోహర్ రెడ్డి నిత్యం నల్లా పౌండేషన్ ద్వారా పలు సేవ కార్యక్రమాలను చేయడమే కాకుండా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలను తెలుసుకొని వాటి పరిష్కరిస్తూ పెద్దపల్లి జిల్లా ప్రజల్లో మంచి ఆదరణను పొందుతున్నాడు.ఇప్పటికే ఎంతో మందికి సహాయం చేసి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు.రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సహకారంతో మండలంలోని అన్ని గ్రామాలకు సీసీ రోడ్లను మంజూరు చేయించారు.తన గ్రామస్థుల కోరిక మేరకు రూ.20 లక్షల రూపాయలతో రామాలయాన్ని నిర్మించారు.తనకున్న భూమిలో కొంతమోత్తన్ని గ్రామ స్మశానానికి విరాళంగా ఇచ్చారు.అంతేకాకుండా దాని చుట్టూ తన స్వంత పైసలతో ప్రహరి గోడను నిర్మించారు.ఇక యువకులకు ఆటపాటలకు క్రికెట్ కిట్,చెస్ వంటి అట సామగ్రిని అందించారు.
SEE ALSO :మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్న నల్లా మనోహర్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అయినటువంటి హరితహర కార్యక్రమానికి ఆకర్షితులై హరిత గ్రామంగా తీర్చి దిద్దేందుకు కావాల్సిన మొక్కలు నాటించి వాటికీ తన స్వంత డబ్బులతో ట్రీ గాడ్స్ ఏర్పాటు చేయించారు.అంతేకాకుండా నల్లా ఫౌండేషన్ ద్వారా బస్టాప్ లల్లో ప్రయాణికులు కూర్చోవడానికి సిమెంట్ బెంచీ లను ఏర్పాటు చేశారు.గీత కార్మిక సంఘానికి రూ.80వేలు ,కుర్మ సంఘానికి రూ.50వేలు అందజేశారు.అంతేకాదు పెద్దపల్లి నియోజకవర్గ లోని దాదాపు అన్ని ఆలయాలకు రూ.10వేల చొప్పున అందజేశారు..జిల్లాలో ఉన్న పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా చాలా మంది పేద విద్యార్థుల ఉన్నతచదువులకు ఆర్థిక సాయం అందిస్తూ తనదైన శైలీలో అందరి మన్నలను పొందుతున్నారు .ఈ విధంగా ఒక వై పు పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే..మరోవైపు పార్టీను బలోపేతం చేయడానికి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చైతన్యవంతం చేస్తున్నారు.రానున్న రోజుల్లో మనోహర్ రెడ్డి కి పార్టీ సముచిత స్థానం కలిపిస్తుంది అనే నమ్మకంతో అయన ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులూ ,కార్యకర్తలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్నారు.ఈ విధంగా నల్లా మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లాలో దూసుకుపోతున్నారు.