ఏపీలో అప్పుడే ఎన్నికల హడావీడి మొదలైయ్యింది. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రదాన పక్షం లో ఉన్న వైసీపీ , మరోపక్క గత నాలుగు సంవత్సరాలనుండి టీడీపీతో స్నేహంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని పక్క ప్లాన్ చేసుకొంటున్నారు. అయితే ఎక్కువగా వైసీపీ వైపు గాలీ వీస్తుంది. టీడీపీ పై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత..పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ గా నిలిచి.. ఇప్పుడు ఆయనపై విమర్శించడంతో పవన్ పై ప్రజల్లో యమ్మకం పోయింది. కనుక అన్ని సర్వేలు వైసీపీ గెలుపు ఖాయం అని చేబుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ నాట పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత అనే విషయంపై ఇప్పుడు ఒక విశ్లేషణ బయటికొచ్చింది. అది కూడా నాలుగు జిల్లాల రాయలసీమ…..ప్రకాశం, నెల్లూరులను కూడా కలుపుకుని మొత్తం గ్రేటర్ రాయలసీమలో టీడీపీని చావుదెబ్బకొట్టనున్నాడు పవన్. పవన్ ప్రభావంతో పరిటాల సునీత లాంటి వాళ్ళకు కూడా ఈ సారి ఓటమి తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రాయలసీమ వరకూ చూసుకుంటే 2014లో జగన్‌కి ఉన్న ఓటు బ్యాంక్‌తో పాటు ఇప్పుడు తెదేపా ప్రభుత్వ అసంతృప్త ఓటు కూడా జగన్‌కే పడుతుంది. ఇక ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి సీట్లు గెలిచే స్థాయిలో ఓట్లు పడే అవకాశం లేదు. అయితే టీడీపీకి సాలిడ్ ఓటు బ్యాంక్ అయిన బీసీలు, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గం అయిన బలిజల ఓటు బ్యాంక్‌ని మాత్రం పవన్ చీలుస్తాడు. 2009లో చిరంజీవి కూడా ఈ ఓట్లను చీల్చడంతోనే చంద్రబాబు భారీగా నష్టపోయాడు. అతిపెద్ద నాయకుడు అని చెప్పుకునే పరిటాల రవి భార్య సునీత కూడా కేవలం రెండు వేల ఓట్లతో చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా బయటపడింది. ఇక ఈ సారి రుణమాఫీ హామీలతో సహా అన్ని హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబుపై అనంత ఓటర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలలో కేవలం తనకు ఉన్న పట్టును జగన్ నిలుపుకున్నా చాలు…….వైసీపీకు పూర్తి ఎడ్జ్ ఇక్కడే వచ్చేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విశ్లేషణ ప్రకారం చూసుకుంటే మాత్రం కచ్చితంగా మొత్తం 70 సీట్లలో 80శాతంపైగా సీట్లు జగన్ సొంతం కానున్నాయి.