రమణ దీక్షితులపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు గురించి ఏం మాట్లాడుతున్నారంటూ పేట్రేగి పోయారు. అంత భయం లేకుండా పోయిందా..? అంటూ రమణ దీక్షితులపై కోపోద్రిక్తులై పోయారు. అసలు ఎవడు అతను..? అంటూ చింతులు తొక్కిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నోటికి ఎంత మాటొస్తే.. అంత మాటా అనేశారు. రమణ దీక్షితులను బొక్కలోకి తోసి నాలుగు తంతే.. అన్ని నిజాలు వస్తాయంటూ మంత్రి సోమిరెడ్డి రెచ్చిపోయారు. రమణ దీక్షితులను జైల్లో వేస్తే.. ఆ తరువాత అన్ని నిజాలు బయటకు వస్తాయని మంత్రి సోమిరెడ్డి అన్నారు.
అయితే, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రమణదీక్షితులపై అన్న వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. రమణ దీక్షితుల గురించి మాట్లాడినా.. మరొక వ్యక్తి గురించి మాట్లాడినా అతి తప్పేనన్నారు. రమణ దీక్షితులను బొక్కలో వేసి రెండు తగిలిస్తే నిజాలు బయలకు వస్తాయా..? రమణ దీక్షితులను మాత్రమే కాదు. టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిని పోలీసుల చేత కేసులు పెట్టించి జైల్లో వేయించి కొట్టించిన ఘనత చంద్రబాబు సర్కార్‌దేనన్నారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఒక్క రమణ దీక్షితులనే కాదు.. ఎవరినైనా అరెస్టు చేసి బొక్కలో వేయించు.. ఆ తరువాత మీ ప్రభుత్వం.. నీ సంగతి తేలుస్తామంటూ అంబటి రాంబాబు సవాల్ విసిరారు.