ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగి బంపర్ మెజారిటీతో గెలుపొందిన బుట్టా రేణుక ఇటివల ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ..ప్రలోభాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .
అయితే నమ్మి ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు గత కొన్నాళ్లుగా ప్రజల నుండి పలు అవమానాలు ,వ్యతిరేకత ఎదురవుతున్న సంగతి తెల్సిందే.తాజాగా టీడీపీ పార్టీకి చెందిన నేతల చేతిలోనే ఆమె తీవ్ర అవమానానికి గురయ్యారు .
ఎంపీ నిధుల కింద మంజురైన మినీ వాటర్ ఫ్లాంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మిగనూరు వెళ్లారు బుట్టా రేణుక .బుట్టా రేణుక హాజరైన ఈ కార్యక్రమానికి స్థానిక టీడీపీ నేతలు కానీ ,మంత్రులు కానీ ఆఖరికి కనీసం టీడీపీ కార్యకర్తలు ఎవరు హాజరు కాలేదు .అయితే ఊహించని షాక్ కు గురైన బుట్టా రేణుక ఉన్నఫలంగా అక్కడ నుండి వెళ్ళిపోయారు .