ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు దిగొచ్చింది.ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులతో సమావేశం అయిన సంగతి తెల్సిందే .ఈ సమావేశంలో ఆక్వా రైతులు ఎదుర్కుంటున్న పలు సమస్యలను గురించి,ఆర్థిక ఇబ్బందుల గురించి అడిగి మరి తెలుసుకున్నారు.
అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్వారైతులతో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చాడు .అంతే జగన్ ఇచ్చిన హామీకి భయపడిన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులతో సమావేశమవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో ఆక్వా రైతులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వలన ప్రభుత్వంలో కదిలక వచ్చింది.అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమతో భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు అని వారు తెలిపారు .