తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు అండగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.
ఈ పథకంలో భాగంగా రైతన్నకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను ఆర్ధిక సాయం ఇస్తున్నారు .ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి తన పేరు మీద రాజధాని ప్రాంతం హైదరాబాద్ కి సమీపంలో ఉన్న 6.18 ఎకరాలకు ప్రభుత్వం ఇచ్చిన ఇరవై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలను తిరిగి స్వచ్చందంగా ప్రభుత్వానికి అందజేశారు.
పంట పెట్టుబడి సాయాన్ని చౌటుప్పల్ కి వచ్చిన ఆమె మండల వ్యవసాయ అధికారికి అందజేసి ప్రభుత్వానికి అందించాలని ఆమె కోరి గొప్ప మనస్సును చాటుకున్నారు ..