తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సంచలన ప్రకటన చేశారు.ఇటీవల రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయితీలుగా మార్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణఫురం మండలం లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన లక్ష్మారెడ్డిపల్లిలో సర్పంచ్‌ను ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాభివృద్ధికి రూ.2కోట్లు కేటాయిస్తామని స్పీకర్ సిరికొండ ప్రకటించారు. గణపురం మండలంలో స్పీకర్ పర్యటించారు.ఈ సంధర్భంగా లక్ష్మారెడ్డిపల్లిని గ్రామపంచాయతీగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్పీకర్‌తో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ… గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని, మీరు కూడా నూతనంగా ఏర్పడిన లక్ష్మారెడ్డిపల్లిలో మంచివ్యక్తిని ఏక గ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రెండు విడతల్లో రూ.2 కోట్లను మంజూరు చేస్తానన్నా రు. గ్రామాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.