Home / SLIDER / బ్రేకింగ్ : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!!

బ్రేకింగ్ : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరగడంతో జోన్ల వ్యవస్థను కూడా పునర్విభజించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలు చెప్పారు. ఈ ప్రతిపాదనలపై గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి చర్చించారు.

 

జోన్ల వివరాలు:
—————–
1. కాళేశ్వరం జోన్ (28.29 లక్షల జనాభా): భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి

2. బాసర జోన్ (39.74 లక్షల జనాభా): ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల

3. రాజన్న జోన్ (43.09 లక్షల జనాభా): కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్

4. భద్రాద్రి జోన్ (50.44 లక్షల జనాభా): కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్

5. యాదాద్రి జోన్ (45.23లక్షల జనాభా): సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ

6. చార్మినార్ జోన్(1.03 కోట్ల జనాభా): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి

7. జోగులాంబ జోన్ (44.63 లక్షల జనాభా): మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్

మల్టీ జోన్లు:
————-
1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి (1.61 కోట్ల జనాభా)
2. యాదాద్రి, చార్మినార్, జోగులాంబ (1.88 కోట్ల జనాభా)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat